The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

నిన్న మొన్నటి వరకు ఆ సినిమా అనుకున్న టైమ్‌కి రిలీజ్‌ అవుతుందా? లేదా? అనేది డౌట్‌. కానీ ఇప్పుడు వరుస ఇంటర్వ్యూలు, అప్‌డేట్లతో తాము పక్కాగా చెప్పిన టైమ్‌కి వస్తాం అని చెబుతుననారు. ఇదంతా ‘జడలు’ గురించే అనే విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. అదేనండీ ‘ది ప్యారడైజ్‌’ సినిమా గురించే అని. సినిమా విడుదలకు మరో వారం మాత్రమే ఉన్న నేపథ్యం నాని అండ్‌ కో. వరుస ఇంటర్వ్యూలు, ఈవెంట్‌లు, ప్రెస్‌ మీట్లు పెడుతున్నారు.

The Paradise

ఈ క్రమంలో నాని చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. ఈ సినిమాలో నాని లుక్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఏ స్టార్‌ హీరో కానీ, యంగ్‌ హీరో కానీ.. అలాంటి ధైర్యం చేయడు. అదే రెండు జడలతో ఈ సినిమాలో నాని కీలక భాగం సన్నివేశాల్లో కనిపిస్తాడు. దీని గురించే నాని ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. ఒక మెయిన్‌ స్ట్రీమ్‌ యాక్టర్‌ జడలతో సినిమాలో కనిపిస్తే ఏదైనా అవ్వొచ్చు. ట్రోలింగ్‌కి గురవ్వొచ్చు. కానీ, కథకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా తాను ఆ రిస్క్‌ తీసుకున్నా అని చెప్పాడు నాని.

‘ఆయా షేర్‌..’ పాట రిలీజ్‌ అయిన తర్వాత ఆన్‌లైన్‌లో ఇప్పటివరకూ లక్ష జడలు అమ్మారని నాని చెప్పాడు. ఆ పాటకు రీల్స్‌ చేసేందుకు చాలా మంది ఆ జడలను కొన్నారని తన టీమ్‌ చెప్పిందని నాని అన్నాడు. ఈ లక్ష లెక్కకు లెక్క ఏంటి అనేది నానికి, లేదంటే ఆయన టీమ్‌కే తెలియాలి. ఈ క్రమంలో మరో జోక్‌ కూడా బయటకు వచ్చింది. అదే ఆ కొనుక్కున్న జడలు వేసుకొని ఆ అభిమానులు ఇప్పుడు థియేటర్లకు వస్తారా? అని.

ఏమో రీరిలీజ్‌లకు మన తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా రకాల హంగామాలు సృష్టిస్తున్నారు. సినిమాలో ఆ పాత్రకు తగ్గ మేక్‌ప్‌లు చేస్తున్నారు. వస్తువులు తీసుకెళ్తున్నారు. ఆ లెక్కన జడలు వేసుకొని వస్తారేమో మరి.

కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus