Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

నందమూరి వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ కోసం చాలా ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిగో, అదిగో అంటూ పలుమార్లు ఆ సినిమా గురించి వార్తలు వచ్చినా.. ఏదీ నిజమవ్వలేదు. ఒక దర్శకుడితో సినిమా అనౌన్స్‌ చేసి, రేపో మాపో సినిమా ప్రారంభం అనుకుంటుండగా సినిమా ఆగిపోయింది. ఇన్ని వాయిదాలు, ఊహాగానాలు, ప్రకటనల మధ్య మరోమారు మోక్షజ్ఞ తొలి సినిమా అయింది. త్వరలో షూటింగ్‌ ప్రారంభం అని కూడా చెప్పారు. ఈలోపు ఓ వార్త బయటకు వచ్చింది.

Mokshagna

నందమూరి మోక్షజ్ఞ హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ సినిమా అనౌన్స్‌ చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ ఓ ముఖ్య పాత్రలో నటిస్తారు అని సమాచారం. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో, మల్టిపుల్ టైమ్‌లైన్స్, పునర్జన్మలు, వీఎఫ్ఎక్స్ అంశాలతో ఈ సినిమా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ లైన్‌ని విన్న బాలయ్య.. తాజాగా సినిమా పూర్తి స్క్రిప్ట్ విన్నారట. ఈ క్రమంలో కథలోలో కొన్ని మార్పులు చెప్పారట.

కథ విషయంలో కొన్ని అంశాలు తొలుత అనుకున్నా.. సినిమా అనౌన్స్‌ అయ్యాక మోక్షజ్ఞ – వశిష్ఠ కాంబినేషన్‌పై నెగిటివ్ టాక్ రావడం కూడా ఓ కారణం అని చెబుతున్నారు. ‘బింబిసార’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వశిష్ఠ.. ఆ తర్వాత చిరంజీవితో తీసిన ‘విశ్వంభర’తో పెద్ద ఎత్తున విమర్శలు అందుకున్నారు. ఆ సినిమానే ఇంకా రిలీజ్‌ చేయలేదు అప్పుడే ఇంకో సినిమా మొదలుపెడుతున్నారా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఈ కథ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని సమాచారం.

ఈ సినిమా కథేంటి అనే విషయంలో చెప్పకపోయినా.. ‘ఆదిత్య 369’ సినిమాకు సీక్వెల్‌గా బాలయ్య ఆ మధ్య తెరకెక్కిస్తా అని చెప్పిన ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’ సినిమానే ఇది అని చెబుతున్నారు. అయితే ఈ సినిమాకు కథ తానే సిద్ధం చేస్తానని అప్పట్లో బాలయ్య చెప్పారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్ వీడియో వస్తే కానీ క్లారిటీ రాదు.

 ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus