హీరో రాజశేఖర్, జీవిత కుటుంబంలో విషాద ఛాయలు!

  • November 2, 2017 / 06:58 AM IST

కొంతకాలంగా హిట్ కోసం డాక్టర్ రాజశేఖర్, జీవితలు ఎదురుచూస్తున్నారు. పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవాలని శ్రమిస్తున్నారు. ఏడాది పాటు కస్టపడి రాజశేఖర్ “పీఎస్వీ గరుడవేగ” ను పూర్తి చేశారు. ఈ సినిమాని చూడకుండానే తన తల్లి మరణించిందని రాజశేఖర్ బాధపడుతున్న వేళ.. ఆ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య జీవిత సోదరుడు మురళి శ్రీనివాస్‌ మరణించారు. గత కొంత కాలంగా మురళి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన  గురువారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల వెల్లడించారు.

మురళి శ్రీనివాస్‌ పార్ధివ దేహాన్ని ఉదయం 9.30 నుంచి గంటన్నర పాటు జూబ్లీహిల్స్ ఫిలించాంబర్ లో ఉంచి, ఆపై మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వివరించారు.  రాజశేఖర్ తన “పీఎస్వీ గరుడవేగ” చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర ప్రీమియర్‌ షోకి మెగా స్టార్ చిరంజీవిని జీవితా రాజశేఖర్‌ ఆహ్వానించారు. మరి ఈ ప్రీమియర్ షో జరుగుందా? అందుకు జీవిత, రాజశేఖర్ హాజరవుతారా? అనేది ప్రశ్నర్ధకంగా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus