ఎన్టీఆర్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వనున్న “అరవింద సమేత” టీమ్!

  • September 17, 2018 / 11:50 AM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ “అరవింద సమేత వీర రాఘవ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ రెండు షేడ్స్ లో కనిపించబోతున్నారు. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 11 న రిలీజ్ చేయనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అతను స్వరపరిచిన పాటల్లో ఒకటి “అనగనగా” రీసెంట్ గా రిలీజ్ అయి మనసుకు హత్తుకుంది. పూర్తి పాటలను సెప్టెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు. అయితే అప్పటికంటే ముందు ఎన్టీఆర్ అభిమానులకు చిత్ర బృందం సర్‌ప్రైజ్ ఇవ్వనుంది.

”అరవింద సమేత ఆడియో ఆల్బమ్ సెప్టెంబర్ 20న డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తాం. సినిమా రిలీజ్‌కి కొద్ది రోజుల ముందు ప్రి రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తాం. మరో సర్‌ప్రైజ్ మీకోసం రేపు ఇవ్వనున్నాం” అని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ ట్వీట్ చేసింది. అయితే ఆ సర్‌ప్రైజ్ సాంగ్ వీడియో ప్రోమో అయి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. మరి ఏవిధంగా సర్‌ప్రైజ్ ఇస్తారో తెలుసుకోవాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. వరుసగా నాలుగు విజయాల తర్వాత రాయలసీమ నేపథ్యంలో ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus