కబాలి…కబాలి…కబాలి….దాదాపుగా ఒక ఏడాది నుంచి ఎక్కడ విన్నా ఇదే పేరు, ఎవరి ఫోన్ లో చూసిన నిరుప్పుడా ఇదే పాట, ఎవరి కాల్ రింగ్టోన్ విన్నా ఇదే టోన్….ఎన్నో అంచనాల మధ్య, ఎంతో భారీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కబాలి బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మన్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ రేంజ్ అనుకోలేని ఈ సినిమాకి రంజిత్ అనే యువ దర్శకుడు దర్శకత్వం వహించాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండే సినిమాలతో సూపర్ స్టార్ రజని లాంటి సినిమా అవకాశం వస్తే ఉపయోగించుకోలేకపోయాడు ఈ దర్శకుడు.
అయితే కబాలి విడుదల ముందు, ఆతరువాత సీన్ పూర్తిగా మారింది. ఆ సినిమా విడుదల ముందు రంజిత్ తో సినిమాలు చేసేందుకు చాలా మంది హీరోలు క్యూ కట్టారు. అయితే కబాలి ఫ్లాప్ కావడంతో హీరోలంతా ఇప్పుడు రంజిత్ ను పలకరించడం కూడా మానేశారు….తమిళ తంబీలు చెబుతున్న వివరాల ప్రకారం…కబాలి తరువాత హీరో సూర్యతో ఒక సినిమా చేస్తాను అని అన్నాడు రంజిత్. కానీ ‘కబాలి’ విడుదలై నెల దాటింది కానీ.. అతడి తర్వాతి ప్రాజెక్టు విషయంలో క్లారిటీ లేదు. మరో పక్క అసలే సూర్య వరుస ఫ్లాప్స్ లో సతమతమవుతున్నాడు.
ఇలాంటి టైంలో రంజిత్ తో సినిమా ఏంటని కొంచెం పునరాలోచనలో పడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో రంజిత్.. విజయ్ హీరోగా సినిమా చేస్తాడన్న వాదన సైతం బయటకు వస్తుంది. అయితే దానిపై రంజిత్ స్పందిస్తూ…ప్రస్తుతం తాను స్క్రిప్టు మీదే దృష్టిపెడుతున్నానని.. ఏ హీరోతో కమిట్మెంట్ తీసుకోలేదని అన్నాడు. ఇంతకుముందేమో సూర్యతోనే సినిమా అన్నాడు, ఇప్పుడేమో ఏ హీరోతో అన్నది ఖరారవ్వలేదు అంటున్నాడు. ఈ తతంగం అంతా చూస్తుంటే సూర్య మన వాడికి హ్యాండ్ ఇచ్చినట్లుగానే అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.