సిల్క్ స్మిత జీవితంలోని అన్ని కోణాలను చూపించనున్న పా రంజిత్

Advertisement

అతి తక్కువకాలంలోనే తన అందాలతో ఆకర్షించిన బ్యూటీ సిల్క్ స్మిత. ఐటెం సాంగ్స్ లో అద్భుతంగా డ్యాన్సులు వేసి తెలుగు, తమిళ భాషల్లో అత్యధిక సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న సిల్క్ స్మిత చిన్నవయసులోనే లోకాన్ని విడిచారు. అయినప్పటికీ ఆమె అభిమానుల గుండెల్లో నిలిచే ఉంది. అందుకే బాలీవుడ్ వారు సిల్క్ స్మిత జీవితాన్ని “ది డర్టీ పిక్చర్” గా తీశారు. ఇందులో ఆమెలోని ఒకే కోణాన్ని చూపించినప్పటికీ ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు సిల్క్ స్మిత పూర్తి జీవితాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీ కాంత్ తో కబాలి, కాలా వంటి సినిమాలను తీసిన పా రంజిత్ సిల్క్ స్మిత జీవితాన్ని వెబ్ సిరీస్ గా రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఆమె బాల్యం నుంచి చనిపోయేవరకూ గల అంశాలకి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. సిల్క్ జీవితంలోని ప్రతి విషయాన్నీ అభిమానులకు జరిగింది జరిగినట్టూ వెబ్ సిరీస్ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా అయితే కమర్షియల్ గా ఆలోచించాలని, అందుకే సినిమాగా కాకుండా వెబ్ సిరీస్ గా తీసుకొస్తున్నట్టు సమాచారం. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉండాలని ఈ సిరీస్ ని పా రంజిత్ నిర్మించబోతున్నారు. “ది డర్టీ పిక్చర్” లో సిల్క్ స్మిత గా విద్యాబాలన్ చక్కగా నటించారు. మరి ఈ సిరీస్ లో సిల్క్ రోల్ ని ఎవరు పోషించబోతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus