పద్మావతి – భాగమతి సూపర్ హిట్స్

Advertisement

ఎన్నడూలేని విధంగా ఈవారం సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ ఒక విచిత్రమైన పోటీని చవిచూసింది. హిందీలో తెరకెక్కిన ‘పద్మావతి’ విడుదలకు ముందు ఎన్ని ఇబ్బందులైతే ఎదుర్కొందో.. విడుదలైన తర్వాత ఆదేస్థాయి ప్రశంసలను కూడా అందుకొంది. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్ తో హౌస్ ఫుల్ షోస్ తో దూసుకుపోతుంది. అదే విధంగా నిన్న విడుదలైన అనుష్క “భాగమతి” కూడా సూపర్ హిట్ టాక్ తో విజయవిహారం చేస్తోంది. ఈ రెండు సినిమాలకు పోటీగా వేరే సినిమాలు లేకపోవడం, లాంగ్ వీకెండ్ తోపాటు మంత్ ఎండ్ కూడా అవ్వడంతో జనాలు థియేటర్లకు తండోపతండాలుగా వస్తున్నారు.

ఆ కారణంగా రెండు సినిమాలు కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.
“పద్మావతి” చిత్రాన్ని ఆల్రెడీ బాలీవుడ్ ఫస్ట్ బాక్సాఫీస్ హిట్ గా డిక్లేర్ చేయగా, “భాగమతి” చిత్రాన్ని కూడా ఈ ఏడాది మొదటి జెన్యూన్ హిట్ అని చెప్పుకొంటున్నారు. ఈ విధంగా ఇద్దరు టైటిల్ పాత్రధారులైన అనుష్క, దీపికాలు నటులుగానే కాక సినిమాలు సక్సెస్ అవ్వడంతో కొత్తేడాదిలో గట్టి హిట్ లు కొట్టి తమ స్టామినాను చాటుకొన్నారు. ఈ విజయం సౌత్ మరియు నార్త్ లో మరిన్ని లేడీ ఓరియెంటెడ్ మరియు కాన్సెప్ట్ మూవీస్ కి ఉతమిస్తుంది. త్వరలోనే ఈ తరహాలో మరిన్ని సినిమాలు రావడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus