Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Advertisement

తిరువీర్ ప్రతి సినిమాకి తన మార్కెట్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. గతంలో ఇతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించినప్పటికీ.. ‘మసూద’ తో హీరోగా మంచి బ్రేక్ వచ్చింది.

Papam Prathap

అటు తర్వాత చేసిన ‘పరేషాన్’ కమర్షియల్ గా అంత ఆడకపోయినా.. తన కంటెంట్ సెలక్షన్ పై మాత్రం నమ్మకం పెరిగేలా చేసింది. ఇక ‘ది ప్రీ వెడ్డింగ్’ షో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

అతని లేటెస్ట్ మూవీ ‘పాపం ప్రతాప్’ ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది. టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించాయి. దీనికి బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఒకసారి ‘పాపం ప్రతాప్’ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను గమనిస్తే :

తెలంగాణ  1.20 cr
సీడెడ్ 0.15 cr
ఆంధ్ర(టోటల్)  1.20 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 2.55 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.20 cr
వరల్డ్ వైడ్ టోటల్ 2.75 cr

‘పాపం ప్రతాప్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.2.75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘తిరువీర్’ సినిమాలకి టార్గెటెడ్ ఆడియన్స్ ఉన్నారు. ‘ఈటీవీ విన్’ ప్రొడక్షన్ సినిమాలు అంటే జనాల్లో నమ్మకం కూడా ఉందని చెప్పడంలో సందేహం లేదు. సో ఈ సినిమాకి మినిమమ్ పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువే.

రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus