ఆ ఒక్కటీ అడక్కు అంటున్న పరిణీతి!

  • December 18, 2017 / 08:35 AM IST

బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీఫుల్ అండ్ బోల్డ్ హీరోయిన్ ఎవరు అని సీనియర్ డైరెక్టర్లు మొదలుకొని జూనియర్ అసిస్టెంట్స్ వరకూ అందరూ చెప్పే పేరు పరిణీతి చోప్రా. ఎనర్జీటిక్ యాక్టింగ్, ఎఫర్ట్ లెస్ పెర్ఫార్మెన్స్ తో అగ్ర కథానాయికగా ఎదుగుతున్న పరిణీతికి కాస్త నోటి దురుసు ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. స్టార్ హీరోలనే కాదు స్టార్ డైరెక్టర్స్ సీనియర్ యాక్టర్స్ గురించి కామెంట్ చేయడంలో పరిణీతి ఏమాత్రం పరిణితి ప్రదర్శించదు. తాజాగా “గోల్ మాల్” సిరీస్ సినిమాలో అజయ్ దేవగన్ సరసన నటించిన ఎఫెక్టో లేక మరింకేదో తెలియదు కానీ.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ఆఫర్ కి నో చెప్పేసింది.

కరణ్ స్వయంగా ఓ వెబ్ సిరీస్ తీదామని డిసైడ్ అయ్యి.. తాను అడిగితే ఎవరూ కాదనరనే నమ్మకంతో తన ఆఫీస్ లో హీరోహీరోయిన్స్ మరియు క్యారెక్టర్ రోల్స్ చేసేవాళ్ళ పేర్లు ఫైనల్ చేసి లిస్ట్ కూడా ఇచ్చేశాడట. ఫార్మాలిటీ కోసం అందరికీ మెసేజ్ చేస్తే.. పరిణీతి “సారీ కరణ్, నీ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలన్నది నా కల. కానీ ఇలా వెబ్ సిరీస్ మాత్రం చేయలేను” అంటూ సింపుల్ గా కరణ్ ఆఫర్ ను తిరస్కరించింది, కరణ్ అడిగితే కాదన్నందున పరిణీతి ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ఎప్పట్లానే పరిణీతి ఈ విషయాలకు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తన సినిమాల షూటింగ్ లో బిజీగా ఉంటోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus