పవన్ – నితిన్ – త్రివిక్రమ్… ఓ సినిమా!

  • November 16, 2016 / 10:46 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చ జరుగుతున్న అంశాల్లో తారాస్థాయికి చేరుకున్న విషయం ఇది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అఆ’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న నితిన్ “ఎక్సయిటింగ్ న్యూస్ కమింగ్ సూన్” అంటూ ఓ ట్వీట్ వేశాడు. ఇది పెళ్లి కోసం కాదని వివరణ కూడా ఇచ్చాడు. అయితే సినిమానే అయుంటుందని ఫిక్సయిపోయిన కొందరు విషయం ఏంటని ఆరా తీయగా మేటర్ బయటికొచ్చింది.

నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వం వహించే ఓ సినిమా కొన్నాళ్లుగా చర్చల వద్దనే ఆగిపోయింది. ఇన్నాళ్లకు ఆ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నిర్మించనుండటం విశేషం. నితిన్ తండ్రి సుధాకర్ కూడా సహ నిర్మతగా వ్యవహరించనున్నారు. కొద్దిసేపటి క్రితం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం మొదలైంది. ‘రౌడీఫెలో’తో దర్శకుడిగా మారిన గేయ రచయిత కృష్ణ చైతన్య రెండో సినిమాగా రూపొందిస్తున్న ఈ సినిమాకి ‘అఆ’ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన నట్టి (నటరాజ సుబ్రమణ్యం) ఛాయాగ్రహణం అందించనున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus