కాటమరాయుడు కోసం బాడీ ఫిట్ పై దృష్టి

  • September 19, 2016 / 08:55 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అనేక కారణాల వల్ల సర్దార్ గబ్బర్ సింగ్ తరవాతి సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి చాలా ఆలస్యమయింది. డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న కాటమ రాయుడు సినిమా రీసెంట్ గా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రేపటి నుంచి రెండో షెడ్యూల్ మొదలు కానుంది. ఈ షూటింగ్ లో 24 నుంచి పవన్ పాల్గొననున్నారు. ప్రస్తుతము అయన జిమ్ లో ఎక్కువసేపు గడుపుతున్నారు. ఒక ఫ్యాక్షనిస్ట్ కి ఉండాల్సిన బాడీని సొంతం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు.

రాయల సీమ నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కి రెండు లవ్ స్టోరీలు ఉన్నట్లు సమాచారం. రెండో సారి శృతి హాసన్ పవన్ పక్కన నటిస్తోంది. ఈ జంట గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ అందుకుంది. మరో సారి వీరిద్దరూ తెర పైన మ్యాజిక్ చేయనున్నారు. ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏమిటంటే యువ హీరోలు శర్వానంద్, నవీన్ చంద్ర, విజయ్ దేవరకొండ లు కీలక పాత్రలో కనిపించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత మందిస్తున్న ఈ ఫిల్మ్ ని అత్యంత వేగంగా పూర్తి చేయడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.


Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus