Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

ప్రముఖ సినీ నటుడు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మరియు ఆయన సతీమణి అన్నా కొణిదెల తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ఓ లేఖని విడుదల చేయడం అందరికీ షాకిచ్చింది. శ్రేయోభిలాషులు, సన్నిహితులను ఉద్దేశించి విడుదల చేసిన ఈ లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. ‘దీపావళి పండుగ వేళ ఇదేం షాక్’ అంటూ అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Pawan Kalyan

‘తమ జీవితంలో ఒక ముఖ్యమైన భాగాన్ని కలిసి పంచుకున్న తర్వాత, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవంతో, పూర్తి పరస్పర అవగాహనతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వారు ఈ లేఖలో పేర్కొన్నారు. భార్యాభర్తలుగా తమ బంధం ముగిసినప్పటికీ, తమ పిల్లల కోసం మంచి స్నేహితులుగా, బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా ఎప్పటికీ కొనసాగుతామని వారు స్పష్టం చేశారు. పిల్లల సంతోషం, వారి శ్రేయస్సే ఎప్పటికీ తమ ఉమ్మడి ప్రాధాన్యత అని క్లారిటీ ఇచ్చారు.

దయచేసి తమ నిర్ణయాన్ని, పర్సనల్ స్పేస్ ను గౌరవించాలని బంధువులకు, మీడియా ప్రతినిధులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేసుకుంటున్నట్టు రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. అన్నా ఓ రష్యన్ సిటిజన్. ఆమె క్రిస్టియన్ ఫ్యామిలీ చెందిన మహిళ. ‘తీన్ మార్’ సినిమా షూటింగ్ టైమ్లో పవన్ కళ్యాణ్, అన్నా..లకి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. 2013 లో పవన్ కళ్యాణ్, అన్నా దంపతులు వివాహం చేసుకున్నారు.

వీరికి ఇద్దరు సంతానం. ఒకరు పాప(అంజనా) బాబు(మార్క్ శంకర్ పవనోవిచ్). 13 ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్న ఈ జంట.. ఇలా విడిపోతారని ఎవ్వరూ ఊహించలేదు. అభిమానులు ఈ వార్తను అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేరు అనే చెప్పాలి.

మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus