మాటల మాంత్రికుడికి డేట్స్ కేటాయించిన పవన్ కళ్యాణ్

  • October 6, 2016 / 11:33 AM IST

సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి చాలా ఆలస్యమైంది. దీంతో ఆయన డేట్స్ కోసం ఎదురు చూస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డేట్లు వృధా అయి పోయాయి. ప్రస్తుతం పవన్ డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ మాత్రం ఖాళీగా ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పవర్ స్టార్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఏకకాలంలో రెండు సినిమాల్లో నటించాలని డిసైడ్ అయ్యారు.

అందుకోసం వచ్చే నెలలో 15 రోజుల డేట్స్ ని మాటల మాంత్రికుడికి కేటాయించారు. అప్పుడు తనపై ఉండే సీన్లను షూట్ చేసి, మిగిలిన రోజుల్లో  తాను లేని ఇతర  సీన్లను చిత్రీకరణ జరుపుకోమని పవన్ సూచించినట్లు తెలిసింది. డిసెంబర్ లో వీలుని బట్టి మరికొన్ని డేట్స్ అడ్జస్ట్ చేయనున్నాడంట. ఫ్రెండ్ కోసం పవర్ స్టార్  ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ వర్గాల వారు చెప్పుకుంటున్నారు. త్రివిక్రమ్ ఆనందంతో షెడ్యూల్ ప్లాన్ చేయడంతో పాటు మ్యూజిక్ డైరక్టర్ అనిరుద్ తో కలిసి పాటల కంపోజింగ్ లో నిమగ్నమయ్యారని తెలిసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus