బాహుబలి చిత్రంపై లేటైనా లేటెస్ట్ గా కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్

  • May 8, 2017 / 08:40 AM IST

బాహుబలి కంక్లూజన్ సినిమాని చూసిన సినీ ప్రముఖులు తమ ఆనందాన్ని ట్వీట్ల రూపంలో వ్యక్తం చేశారు. ఈ జాబితాలో టాలీవుడ్ మాత్రమే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ స్టార్లు కూడా ఉన్నారు.  తాజాగా ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ స్పందించారు. భారతీయ సినీ చరిత్రలో తొలిసారి వెయ్యికోట్లు వసూలు చేసిన చిత్రంగా బాహుబలి నిలవడంపై అయన మాట్లాడారు.  “బాహుబలి వెయ్యికోట్లు వసూలు చేసినందుకు రాజమౌళి, ప్రభాస్ బృందానికి శుభాకాంక్షలు. ఈ సినిమా కోసం ఐదేళ్లపాటు కష్టపడిన రాజమౌళి మనందరినీ గర్వంగా తలెత్తుకునేలా చేశారు.

భవిష్యత్తులో రాజమౌళి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను” అని పవన్‌ అభినందించారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. వేగంగా ఈ సినిమాని కంప్లీట్ చేయాలనీ ఎండలను సైతం లెక్కచేయకుండా శ్రమిస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus