పవన్ కన్ఫర్మ్ చేశాడు..!

  • April 11, 2016 / 11:32 AM IST

గత కొంతకాలంగా పవన్ కళ్యాన్ రెండు, మూడు సినిమాలు చేసిన తరువాత సినిమాలను వదిలేస్తాడనే వార్తలు వినిపించాయి. పవన్ సైతం ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. అయితే ఆ రెండు మూడు చిత్రాలు ఎవరితో చేస్తాడనే అనుమానాలు నిన్నటివరకు ఉండేవి. పవన్ ఇప్పుడు ఆ దర్శకుల పేర్లు కన్ఫర్మ్ చేశాడు. తనతో ‘అత్తారింటికి దారేది’ సినిమా చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో, ‘ఖుషి’,’కొమరం పులి’ వంటి సినిమాలు చేసిన ఎస్.జె.సూర్యతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ విషయాన్ని పవన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి పవన్, దాసరిల సినిమా ఉండకపోవచ్చనే తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus