సాహో జనసేనాని .. పవన్ కళ్యాణ్ పై అభిమాని పాట!

  • September 9, 2016 / 08:15 AM IST

పవన్ కళ్యాణ్.. ఓ పవర్. మాటలతో సరిపెట్టే వ్యక్తి కాదు.. చేతల్లో చూపించే మనిషి. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలని పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రజలను చైతన్యం చేయడానికి నడుం బిగించారు. అందుకోసం నేడు కాకినాడలో జనసేన అధినేత “సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ”ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా  పవన్ అభిమానులు “సాహో జనసేనాని ..” అనే పాటను రూపొందించారు.  బి.వెంకటేశ్వర్లు, టి.శ్రీనివాస్ రావులు అనే యువకులు “నువ్వే మా నేత కావాలి.. మీరు ఒక అడుగు వేస్తె వేల అడుగులు వేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని” పవన్ పై అభిమానాన్ని అక్షరాల ద్వారా చూపించారు.

“గుండెల్లో వేడి, చూపుల్లో వాడి, చేసేయ్ దాడి, అడుగేయ్ సర్దార్” అంటూ మొదలయ్యే పాట ఫైర్ ని రగిలిస్తోంది. పవన్ ఫ్యాన్స్ గుండెల్లో చేరేలా యువగాయకుడు స్వీకర్ అగస్తి ఈ పాటను అద్భుతంగా పాడారు. బాజీ అందించిన సంగీతం నేటి సభ ఫీవర్ ని తెలియ జేస్తోంది. వీరి ఉమ్మడి కృషి ఫలితంగా ఈ పాట యూట్యూబ్లో విపరీతమైన లైకులు అందుకుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus