కాటమరాయుడిని ఆశ్చర్యపరిచిన తమ్ముళ్లు!

  • February 28, 2017 / 12:33 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడమంటే యువ హీరోలకు చాలా ఇష్టం. అందుకే చిన్న పాత్రల్లోనైనా కనిపించాలని తపిస్తుంటారు. అటువంటిది పవన్ కి తమ్ముల్లుగా నటించే అవకాశం వస్తే ఆనందానికి హద్దులు ఉండవు. అలాంటి సంతోషంలోనే యువ హీరోలు శివ బాలాజీ, కమల్ కామరాజు,  అజయ్ లు ఉన్నారు.

డాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న కాటమరాయుడు సినిమాలో వీరు ముగ్గురూ పవన్ కి తమ్ముల్లుగా నటిస్తున్నారు. నార్త్ స్టార్  ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రం  షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా అన్నయ్యకు తమ్ముళ్లు అద్భుతమైన గిఫ్ట్ ని ఇచ్చారు. ఆ కానుకని చూసి కాటమరాయుడు ఏవిధంగా స్పందించారో తెలుసుకోవాలంటే కింది వీడియోని చూడండి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus