శివుని పూజ అనంతరం పవన్ కళ్యాణ్ సినిమా పేరు ప్రకటన

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవుడిని నమ్ముతారు కానీ.. తన సినిమాల విషయంలో సెంటిమెంట్లు నమ్మరు. కానీ తొలిసారి శుభ ముహుర్తాలపై దృష్టి పెడుతున్నారు. అది పవన్ ఇష్టమో.. త్రివిక్రమ్ కోరికో తెలియదు కానీ .. వీరి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మూవీ అంత పద్ధతి ప్రకారం వెళుతోంది. ఈ విశేషాలు చెప్పడానికి రెండు సార్లు సాయంత్రం ఐదు గంటలకు సమయాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు టైటిల్ ప్రకటన విషయంలోనూ మంచి ముహూర్తం చూసుకుంటున్నారు. ఈ మూవీ టైటిల్ ని 27 న రిలీజ్ చేస్తారని టీమ్ స్పష్టం చేసింది. ఈరోజు సినిమా యూనిట్ మొత్తం కాశీ కి పయనమైంది. కాశీ, గయ, అలహాబాద్ ల్లో కొన్ని సీన్లు షూట్ చేయనున్నారు.

ఈ సందర్భంగా కాశీలోని విశ్వనాధ ఆలయంలో శివుని సన్నిథిలో అజ్ఞాతవాసి టైటిల్ వున్న బాక్స్ ను ఓపెన్ చేసి, పేరు అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. అను ఇమ్యానియాల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కుష్బూ, వెంకటేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 10 న రిలీజ్ చేయనున్నారు. జల్సా, అత్తారింటికి దారేది కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus