ఆడపిల్లల పట్ల జరుగుతున్న అమానుషాల్ని చూస్తూ ఊరుకోను : పవన్ కళ్యాణ్

గత కొన్ని వారాలుగా ఇండస్ట్రీని కుదిపేస్తున్న “క్యాస్టింగ్ కౌచ్” గురించి పెద్ద హీరోలెవరూ రెస్పాండ్ అవ్వలేదు, అంటే అగ్ర కథానాయకులు ఈ రచ్చని ఎంకరేజ్ చేస్తున్నాట్లా అనే వాదనలు వినిపిస్తున్నాయి. పరిశ్రమ భగ్గుమంటున్న తరుణంలో మహేష్ బాబు తన ఫ్యామిలీతో హాలీడే ట్రిప్ కి వెళ్ళడం, ఎన్టీయార్ తన తాజా చిత్రం ప్రిపరేషన్ లో బిజీగా ఉండడం, ప్రభాస్ “సాహో” షూటింగ్ లో బిజీగా ఉండడం, అల్లు అర్జున్ “నా పేరు సూర్య” చివరి షెడ్యూల్, రామ్ చరణ్ “రంగస్థలం” సక్సెస్ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉండడం వలన ఒక్కరంటే ఒక్క స్టార్ హీరో కూడా ఈ “క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ” గురించి రెస్పాండ్ అవ్వలేదు.

అయితే.. ఈ ఇష్యూ గురించి మొదటిగా పబ్లిక్ గా కామెంట్ చేయడమే కాక రెస్పాండ్ అయ్యింది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే.. ఆయన ప్రస్తుతం టీవీ చానల్స్ లో జరుగుతున్న రచ్చని ఎంకరేజ్ చేయలేదు. ఇలాంటివాటి విషయంలో పబ్లిక్ గా కంటే చట్టపరంగా ముందుకెళ్లాలని ఆయన సూచించారు. అలాగే.. తన సినిమా షూటింగ్ టైమ్ లో అమ్మాయిలపై కొందరు అసభ్యంగా ప్రవర్తించారని, వెంటనే తాను స్పందించి వారికి బుద్దిచెప్పానని పవన్ కళ్యాణ్ పేర్కొనడం విశేషం. ఏదేమైనా.. ఇలాంటి ఇష్యూ గురించి పవన్ స్పందించడం అనేది స్వాగతించదగ్గ విషయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus