మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ ఇద్దరూ మెగా-పవర్ అభిమానులకు రెండు కళ్ళు. అయితే రాజకీయాల పుణ్యమో, లేకపోతే మారుతున్న కాల ప్రభావమొ తెలీదు కానీ, మొత్తానికి వీరిద్దరి మధ్య కాస్త కోల్డ్ వార్ నడుస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంకో రకంగా చెప్పాలి అంటే మెగా ఫ్యామిలీ అంతా ఒకవైపు పవన్ ఒక్కడే ఒకవైపు అన్నట్లుగా అయిపోయింది పరిస్థితి. ఈ క్రమంలో ఎవ్వరు ఏం మాట్లాడినా మీడియా ఇట్టే పట్టేసి తమకు నచ్చిన స్టైల్ లో చూపిస్తుంది.
అయితే తాజాగా పవన్ చిరు గురించి మాట్లాడిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే చిరు ని పవన్ ఏమన్నాడు అని తెలుసుకోవాలి అంటే మాత్రం మనం ఈ స్టోరీ చదవాల్సిందే…విషయంలోకి వెళితే…పవన్ యూనైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ వార్సికోత్స వేడుకలకు ముఖ్య అతిథిగా వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ పవన్ కొందరు అభిమానులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ…చిరు వార్‌శత్వంపై అనేక విషయాలు బయటపెట్టారు….ఒక అభిమాని పవన్ తో…‘మీ ఫ్యామిలీకి ఎలాంటి వారసత్వం చిరంజీవి నుంచి వచ్చింది’ అని అడగగా…పవన్ మాట్లాడుతూ…చిరుని పొగడ్తలతో ముంచెత్తాడు.
అన్నయ్య చిరంజీవి యాక్టర్ కావాలని కలలు కనడమే కాకుండా దానికోసం ఎంతో కష్టపడ్డాడని అంటూ ఆ ఎదురీతలో ఎన్నో కష్టాలను తన అన్న చిరంజీవి పడిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు పవన్. అంతేకాదు తన స్వయం కృషితో ఎదిగిన తన అన్న చిరంజీవి వారసత్వం నుండి తనకు కష్టపడే మనస్తత్వం వచ్చిన విషయాన్ని తెలిపాడు పవన్. ఇలా పవన్ తన వ్యాఖ్యలతో పవన్ చిరు మధ్య ఏదో ఉంది అని అనుకుంటున్న వారికి సరైన సమాధానమే ఇచ్చాడు. అది మరి…పవర్ స్టార్ అంటే…