“సర్దార్” లో ఆ సీన్ కేక!!!

  • February 29, 2016 / 11:06 AM IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ డైలీ అప్‌డేట్స్ రోజుకో సరికొత్త వార్తను తీసుకొస్తున్నాయి. తాజాగా వచ్చిన వార్త వింటే టాలీవుడ్ సినిమా డెఫినేషన్ పూర్తిగా మారిపోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. సహజంగా డైరెక్టర్స్ డైరెక్ట్ చేసిన సీన్లో మన పవర్ స్టార్ నటిస్తేనే సినిమా ఒక రకంగా ఉంటుంది. అలాంటిది మన పవర్ స్టార్ బరిలోకి దిగి ఒక యాక్షన్ సీక్వెన్స్ తీస్తే…ఆ సీన్ చూసినప్పుడు వచ్చే కిక్కె వేరబ్బా.

అసలు విషయం ఏంటంటే తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో భాగంగా ‘ఒక ఆక్షన్ సీన్’ ను తెరకెక్కించారంట. సహజంగా ప్రతీ సినిమాలో యాక్షన్ సీన్స్ కామన్ కదా అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్లే…ఈ యాక్షన్ సీన్ అలాంటి ఇలాంటి సీన్ కాదండి…సినిమా మొత్తంలోని 40 కేరక్టర్లు, వెయ్యిమంది మంది జూనియర్ ఆర్టిస్టులు, మూడు యూనిట్లు, 10 వింటేజ్ కార్లు, 100 గుర్రాలు 20 లగ్జరీ కార్లు. అసలు సినిమా మొత్తం ఈ సీన్ లోనే ఉందేమో అనిపించే అంతటి యాక్ష సీన్ అంట. అసలు ఇప్పటివరకూ ఏ హీరో చెయ్యని విధంగా ఈ సీన్ లో పవన్ కల్యాణ్ ఇరగదీస్తాడని ఇండస్ట్రీ టాక్. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చూస్తే ఇప్పటివరకూ టాలీవుడ్ లో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ ఒక ఎత్తు…ఈ సినిమా ఒక్కటే ఒక ఎత్తు అన్నట్లు చెబుతున్నారు. మరి ఇదే నిజం అయితే, ఆ సీన్ అంత సూపర్ గా వస్తే…పవర్ స్టార్ అభిమానులకు పండగే..పండగ…ఇంకెందుకు ఆలస్యం పవర్ స్టార్ ఫాన్స్…..ఏప్రిల్8 కోసం ఎదురు చూస్తూ ఉండండి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus