వైరల్ అవుతున్న అకీరా నందన్ పిక్..!

ప్రస్తుతం టాలీవుడ్ లో కొందరి స్టార్ హీరోల వారసుల ఎంట్రీ పై కొన్ని ఆసక్తికర చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కినేని థర్డ్ జనరేషన్ హీరో అయిన అఖిల్ ఎంట్రీ ఇచ్చేసాడు. ఇక నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎంట్రీ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ 2019లో ఉండబోతుందని కొందరు ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. అయితే అఖిల్ – మోక్షజ్ఞ లకు అదిరిపోయే కాంపిటీషన్ ఎవరి నుండీ రాబోతుంది అనేది మరో ప్రశ్న? ఇప్పుడు ఈ ప్రశ్నకు ధీటైన సమాధానంగా కనిపిస్తున్నాడు అకీరా నందన్. అయితే అకీరా ఇంకా చిన్న వయసే అయినప్పటికీ.. చూడ్డానికి 6 అడుగుల పైనే హైట్ తో ఇప్పటికే చాలా మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారసుడిగా అతడు భవిష్యత్తులో సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.

అకీరా నందన్ కొణిదెల… ఈ పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి, భార్య రేణు దేశాయ్‌ కి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలున్న సంగతి తెలిసిందే. పవన్ నుండి విడిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ… రేణు దేశాయ్ దగ్గరే ఉంటున్నారు. తాజాగా రేణు దేశాయ్, అకీరా నందన్, ఆద్యల లేటెస్ట్ పిక్స్ ను… సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అకీరా నందన్ పిక్‌ ను చూసిన పవన్ అభిమానులు.. ప్రశంసల వర్షం కురిపిస్తూ కామెంట్లు పెడుతున్నారు. భవిష్యత్తులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాదిరే స్టార్ హీరోగా ఎదగడం ఖాయమని.. వారి గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ పిక్ చూస్తుంటే అది నిజమే అనిపించక మానదు. అందులోను ఇప్పుడు టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్యామిలీ.. మెగా ఫ్యామిలీనే అనడంలో సందేహం లేదు. అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అంటే.. ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు అనడంలో సందేహం లేదు. ఒకవేళ అకీరా ఎంట్రీ ఫిక్స్ అయితే… రాంచరణ్ ని మించి గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని… ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus