డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడవ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో కొన్ని రోజుల క్రితం హీరో పవన్, హీరోయిన్లు అను ఇమ్మానియేల్ , కీర్తి సురేష్ లపై రొమాంటిక్ సన్నివేశాలను షూట్ చేశారు. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. నాన్ స్టాప్ గా షూటింగ్ పూర్తిచేసి, ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయాలనీ నిర్మాత రాధాకృష్ణ మొదట్లో అనుకున్నారు. తాజా సమాచారం ప్రకారం దసరాకి పవన్ సినిమా విడుదల కావడం లేదు. కారణం అన్వేషిస్తే అసలు విషయం బయట పడింది.
సెప్టెంబర్ లో ఎన్టీఆర్ జై లవకుశ, మహేష్ బాబు స్పైడర్, బాలకృష్ణ 101 వ రిలీజ్ అవుతోంది. ఈ మూడు క్రేజీ ప్రాజక్ట్ లే. అప్పుడు పోటీగా రావడం వల్ల కలక్షన్స్ పరంగా నష్టపోతామని భావించిన త్రివిక్రమ్, రాధాకృష్ణ పోస్ట్ పోన్ చేశారు. సంక్రాంతికి అయితే వసూళ్లు బాగుంటాయని, అప్పుడే విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారు. పవన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నటిస్తున్న ఈ మూవీకి “దేవుడే దిగి వచ్చినా..”, ‘పరదేశ ప్రయాణం’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.