పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అత్తారింటికి దారేది 131 కోట్లు రాబట్టి పవన్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. మళ్లీ వీరిద్దరి కలయికలో ఫిల్మ్ రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో నటిస్తున్న “కాటమరాయుడు” పూర్తికాగానే త్రివిక్రమ్ డైరక్షన్ లో మూవీ ప్రారంభం కానుంది. ఇందుకోసం టెక్నీషియన్లతో పాటు ఆర్టిస్టుల సెలక్షన్ కూడా డైరక్టర్ పూర్తి చేశారు. “దేవుడే దిగి వచ్చినా..” అనే టైటిల్ అనుకుంటున్న ఈ చిత్రానికి ఖుషి సినిమాకు కెమెరామెన్ గా పనిచేసిన ప్రముఖ ఫోటో గ్రాఫర్ పీసీ శ్రీరామ్ ని తీసుకున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ పాటలను అందించనున్నారు.
హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్లుగా నటించనున్నారు. సినిమా ప్రకటన దగ్గరినుంచి ఆసక్తి రేకెత్తిస్తోన్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల 14వ తేదీ నుంచి మొదలుకానున్నట్లు సమాచారం. అందుకే మార్చి మొదటి వారానికి కాటమరాయుడు ప్రొడక్షన్ కంప్లీట్ చేయాలనీ పవన్ భావిస్తున్నారు. ఈ మూవీ ఉగాది కానుకగా 24 న థియేటర్లోకి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.