‘క్లైమాక్స్’ పై కుస్తీ పడుతున్న త్రివిక్రమ్-పవన్!

  • July 6, 2017 / 07:23 AM IST

ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్…మరొకరు…మాస్ మ్యాన్…పవర్ స్టార్ పవన్ కల్యాణ్…ఈ ఇద్దరు కలిస్తే…ఏం జరుగుతుందో…ప్రత్యేకంగా చెప్పాలా…సాక్షాత్తూ టాలీవుడ్ ఉలిక్కి పడుతుంది…సరికొత్త రికార్డులకు ఊతం వస్తుంది…ఈ విషయం ఇప్పటికీ పలుమార్లు రుజువు అయ్యింది…అయితే అదే హిట్ కాంబినేషన్ ను మళ్ళీ రిపీట్ అవుతున్న క్రమంలో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి…అదే క్రమంలో ఈ సినిమా కధ ఎలా ఉండబోతుంది?….అసలు పవన్ కల్యాణ్ ను త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నాడు అన్న ఆలోచనలతో ఆన్‌లైన్ లో హల్‌చల్ చేస్తున్నారు మన పవన్ ఫ్యాన్స్. ఇక మరో పక్క…ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో ఇంకా తెలియకపోయినా ఆ సినిమా షూటింగ్ మాత్రం ఎటువంటి బ్రేక్ లు పడకుండా సాగుతుంది. ఇదంతా పక్కన పెడితే…ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ కాస్త ఆందోళన పడుతున్నట్లు సమాచారం…దానికి కారణం ఏంటి అంటే ఒకసారి ఈమ్యాటర్ చదవండి…‘అత్తారింటికి దారేది’ సినిమా క్లైమాక్స్ లాగా ఈ మూవీ క్లైమాక్స్ కూడ అత్యంత భారీ ఎమోషనల్ సన్నివేశాలతో ఉండేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు క్రమంలో…ఈ క్లైమాక్స్ సన్నివేశాల కోసం త్రివిక్రమ్ చాల భారీ డైలాగ్స్ వ్రాసినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే మరో పక్క ఈ మూవీ క్లైమాక్స్ ను ఒక భారీ ఎమోషనల్ సన్నివేశంతో ముగించాలని త్రివిక్రమ్ భావిస్తూ ఉన్నా పూర్తిగా ఎమోషనల్ టచ్ ఇస్తూ ఈ భారీ సన్నివేశాలను కష్టపడి తీసిన తరువాత ఈ మూవీ క్లైమాక్స్ ‘అత్తారింటికి దారేది’ క్లైమాక్స్ లా ఉంది అన్న కామెంట్స్ వస్తాయా అన్న అనుమానాలు కూడ త్రివిక్రమ్ ను వెంటాడుతున్నట్లు టాక్. దీనితో ఈ కీలక క్లైమాక్స్ విషయంలో త్రివిక్రమ్ పవన్ అభిప్రాయాలను కూడ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా క్లైమ్యాక్స్ ఎలా ఉంటుందో? అసలు ఎలా ముగుస్తుందో…చూద్దాం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus