Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Advertisement

డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు సినిమాల వసూళ్లు దెబ్బతినడం అనేది కొత్త విషయం కాదు. ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే.. హీరో ఎవరు అనేది చూడకుండా సినిమాలని ఆదరిస్తారు.

Ustaad Bhagat Singh

అందువల్ల డబ్బింగ్ సినిమాల డామినేషన్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలు కూడా ఇందుకు అతీతం కాదు. ‘రోబో’ పక్కన వచ్చిన ‘ఖలేజా’ ఎలాంటి అవమానాన్ని మూటగట్టుకుందో అందరికీ తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్టు ఉంది.

ఆ లిస్టులో స్టార్ హీరోలైన ఇద్దరు బ్రదర్స్ సినిమాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఆ బ్రదర్స్ అయిన స్టార్ హీరోలు మరెవరో కాదు చిరంజీవి, పవన్ కళ్యాణ్. అవును.. ఈ స్టార్లు కూడా డబ్బింగ్ సినిమాల వల్ల ఇబ్బంది పడ్డారు. విషయంలోకి వెళితే.. 4 ఏళ్ల క్రితం చిరంజీవి ‘గాడ్ ఫాధర్’ సినిమా వచ్చింది. ఇది ‘లూసిఫర్’ కి రీమేక్. కోవిడ్ టైమ్లో ఓటీటీల్లో పక్క భాషల సినిమాలను కూడా ప్రేక్షకులు ఎక్కువగా చూశారు. ఆ లిస్టులో ‘లూసిఫర్’ కూడా ఉంది.

ఆ కారణంగా ‘గాడ్ ఫాదర్’ కి టికెట్ రేట్లు పెంచకుండా రిలీజ్ చేశారు. అయితే పక్కన ‘కాంతార'(కన్నడ) అనే డబ్బింగ్ సినిమా వచ్చి ‘గాడ్ ఫాదర్’ వసూళ్లని దెబ్బకొట్టింది. అందువల్ల ‘గాడ్ ఫాదర్’ ఫ్లాప్ గా మిగిలిపోయింది. సరిగ్గా ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఈ సినిమాకి కూడా టికెట్ రేట్లు పెంచకుండా ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు. కానీ డబ్బింగ్ సినిమా ‘దురంధర్ 2′(దురంధర్ ది రివేంజ్) ముందు తేలిపోయింది.

ఈ సినిమాకి దారుణమైన ఓపెనింగ్స్ వస్తున్నాయి.వాస్తవానికి అప్పుడు ‘గాడ్ ఫాదర్’ కానీ ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కానీ మంచి టాకే తెచ్చుకున్నాయి. అయినా సరే డబ్బింగ్ సినిమాల ముందు ఇబ్బంది పడ్డాయి. అందుకు కారణం.. రిలీజ్ కి ముందు ఈ సినిమాలకి బజ్ లేకపోవడం వల్లనే అని చెప్పాలి.

తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus