పవన్ కళ్యాణ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

  • October 15, 2016 / 06:42 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ గేర్ మార్చారు. నాన్ స్టాప్ గా సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. డాలీ దర్శకత్వంలో అయన నటిస్తున్న కాటమరాయుడు షూటింగ్ వేగంగా జరుగుతోంది. శరత్ మరార్ నిర్మిస్తున్న ఇందులో శృతిహాసన్ ప్రధాన హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ యామిని భాస్కర్ తోను పవన్ రొమాన్స్ చేయనున్నారు.

పవర్ స్టార్ తొలిసారిగా ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనున్న ఇందులో ఆయనకు తమ్ముళ్లుగా అజయ్, శివబాలాజీ, కమల్ కామరాజులు నటిస్తున్నారు. రాయల సీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని మార్చి 31న రిలీజ్ చేసేందుకు నిర్మాత శరత్ మరార్ ఫిక్స్ అయ్యారు. పవన్ కూడా అత్యంత వేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఏ.ఎం.రత్నం నిర్మించనున్న సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారు. అందుకే జనవరి నాటికి కాటమరాయుడు మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేయాలని చిత్ర బృందం శ్రమిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus