కాలు బెణకడంతో ఇబ్బందిపడుతున్న శ్రీ పవన్ కల్యాణ్ గారు

  • July 25, 2018 / 10:34 AM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పోరాట యాత్రకు వెళ్ళిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారికి కాలు బెణికింది. భీమవరంలోని ఎన్.డి.ఫంక్షన్ హాల్ లో బస చేశారు. మంగళవారం శ్రీ పవన్ కల్యాణ్ గారిని కలిసేందుకు భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులు ఆ ప్రాంగణానికి చేరుకున్నారు.

వారితో మాట్లాడేందుకు వస్తున్న సమయంలో నేల తడిగా ఉండటంతో కాలు స్కిడ్ అయింది. ఫలితంగా శ్రీ పవన్ కల్యాణ్ గారి కుడి కాలు బెణికింది. వెంటనే బ్యాండేజీతో కట్టు వేశారు. నొప్పితో ఇబ్బందిపడ్డారు. ఆ నొప్పితోనే జన సైనికుల్ని కలిసి మాట్లాడారు. వైద్యులు వచ్చి పరీక్షించారు. నొప్పి నివారిణులు వాడాలని చెప్పారు. కాలుకి క్యాప్ వేసి స్వల్ప విశ్రాంతి అవసరం అని సూచించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus