పవన్ లుక్ అదిరిపోయిందిగా..!

  • June 29, 2020 / 11:41 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ‘వకీల్ సాబ్’ చిత్రంతో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ అయిన ‘పింక్’ కు ఇది రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ అమితాబ్ పోషించిన లాయర్ పాత్రను ఇక్కడ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. దిల్ రాజు, బోణి కపూర్ లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఎం.సి.ఎ’ దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు క*నా ఎఫెక్ట్ వల్ల లాక్ డౌన్ కనుక రాకుండా ఉండి ఉంటే.. మే నెలలోనే ‘వకీల్ సాబ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘వకీల్ సాబ్’ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో కీలక కోర్ట్ సన్నివేశం నుండీ పవన్ కళ్యాణ్ పిక్ ఒకటి లీక్ అయ్యింది. ఇలా లీక్ అయ్యిందో.. లేదో.. అలా వైరల్ అయిపోతుంది.

ఎంతో ఇంటెన్స్ లుక్ లో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. అంతేకాదు ఈ పిక్ లో మనం హీరోయిన్ అంజలిని కూడా చూడొచ్చు. ఆమె కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పిక్ లో పవన్ కు ఎక్కువ గడ్డం లేదు. చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో అయితే పవన్ కళ్యాణ్.. ఎక్కువ గడ్డంతో ఉన్నాడు. మరి ఈ పిక్ ను బట్టి చూస్తుంటే.. ఇది క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశం అయ్యి ఉంటుంది అని.. కొందరు అంచనా వేస్తున్నారు.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus