Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ అంటూ పవన్‌ కల్యాణ్‌ వక్తిత్వాన్ని అక్షర రూపంలో రాయించి ప్రేక్షకులకు అందించారు హరీశ్‌ శంకర్‌. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాలోని ఆ పాట ఇప్పుడు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్‌ అవుతోంది. ఈ పాట విడుదల సందర్భంగా హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ పవన్‌ గురించి మరికొన్ని విషయాలు కూడా చెప్పారు. అందులో ఒకటి యాడ్స్‌/ అండార్స్‌మెంట్స్‌. పవన్‌ – యాడ్స్‌ విషయంలో జరిగింది ఇదీ అంటూ పవన్ వ్యక్తిత్వం గురించి, ఆలోచనా విధానం గురించి ఆ విషయాలు చెప్పారు హరీశ్‌.

Pawan Kalyan

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒకసారి మాత్రమే ప్రకటనల్లో నటించినట్లు గుర్తు. ‘జానీ’ సినిమా సమయంలో పెప్సీకి ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేశారు. దాని కోసం కొన్ని యాడ్స్‌లో నటించారు కూడా. ఆ రోజుల్లో అవి పెద్ద సంచలనం. అప్పటికే చిరంజీవి ‘థంబ్స్‌ అప్‌’కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండటంతో.. పవన్‌ యాడ్స్‌ విషయంలో పెద్ద చర్చ కూడా జరిగింది. అయితే ఆ తర్వాత పవన్‌ మరే కంపెనీకి యాడ్‌ చేయలేదు.

‘గ‌బ్బ‌ర్ సింగ్’ సినమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాక ప‌వ‌న్‌కు అసాధార‌ణ‌మైన క్రేజ్ వ‌చ్చి.. ఆయ‌న‌తో బ్రాండ్స్ ప్ర‌మోట్ చేయించుకోవ‌డానికి కంపెనీలు పోటీ పడిన విషయాన్ని హరీశ్‌ శంకర్‌ గుర్తు చేశారు. ఓ సారి షారుఖ్ ఖాన్‌తో స‌మానంగా రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌డానికి కంపెనీలు ముందుకొచ్చాయ‌ని.. కానీ కొన్ని ఉత్ప‌త్తులు ఆరోగ్యానికి మంచివి కావ‌ని, ఇంకొన్ని చిన్న పిల్ల‌ల‌కు మంచివి కావ‌ని ఆయ‌న వ‌ద్దనుకున్నారని హరీశ్‌ చెప్పారు. అలా త‌న క‌ళ్ల ముందే ప‌వ‌న్ రూ.కోట్లు వ‌దులుకోవ‌డం చూశాన‌ని చెప్పారు.

నిజమే.. పవన్‌ కల్యాణ్‌కి ఉన్న ఇమేజ్‌, ఆయన సినిమాల ఫలితాలు, ఫ్యాన్‌ బేస్‌ ఇలా ఏవి చూసుకున్నా వరుస యాడ్స్ చేసే అవకాశం ఆయనకు ఉంది. త్రివిక్రమ్‌ లాంటి ఇండస్ట్రీ బెస్ట్‌ యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ కూడా ఉన్నారు. కానీ కొన్ని నియమాలకు కట్టుబడి యాడ్స్‌లోకి తిరిగి రాలేదు. ఇప్పుడు హరీశ్‌ కూడా అదే చెప్పారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus