అన్నయ్య కోసం మూడేళ్లుగా వేచి చూస్తున్న పాయల్

  • January 25, 2019 / 07:45 AM IST

పాయల్ రాజ్ పుట్ అనే పేరు వినగానే అందరికీ “ఆర్ ఎక్స్ 100” సినిమాలో హీరోను మోసం చేసిన హీరోయిన్ అనో లేక ఇంటర్నెట్ లో హాట్ ఫోటోస్ పెడుతూ యువతను ఆకట్టుకొనే కథానాయిక అని మాత్రమే గుర్తొస్తుంది. కానీ.. వీటన్నిటి వెనుక మనకు తెలియని ఓ చీకటి కోణం ఉంది పాయల్ జీవితంలో. పాయల్ రాజ్ పుట్ కి ఎంతో ఇష్టమైన ఆమె అన్నయ్య ఆమె నుంచి దూరమై మూడేళ్లు కావస్తోందట. ఈ విషయాన్ని ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది పాయల్. దాంతో అప్పటివరకూ పాయల్ ను సెక్సువల్ ఆబ్జెక్ట్ లా చూసినవాళ్ళందరూ ఆమెలోని ఈ సెన్సిబుల్ యాంగిల్ ను చూసి షాక్ అయ్యారు. నువ్ ఎక్కడున్నా తిరిగి వచ్చేయ్ భాయ్ అనే పాయల్ పోస్ట్ అందర్నీ ఆలోచింపజేసింది.

పాయల్ ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. ఈ రెండు కాకుండా ఆమె తెలుగులోనూ ఒక సినిమా ఒప్పుకుంది. కాకపోతే.. ఆమె ఊహించినట్లుగా భారీ ఆఫర్లైతే రాలేదు. ఆందరూ ఆమెకు ఉన్న సెక్సీ ఇమేజ్ కారణంగా సెకండ్ హీరోయిన్ లేదా ఐటెమ్ సాంగ్ ఆఫర్స్ మాత్రమే వస్తున్నాయి. కానీ.. అమ్మడు మాత్రం ఓపిగ్గా సరైన ఆఫర్ కోసం వెయిట్ చేస్తోంది. ఆమె వెయిటింగ్ చేసినందుకైనా ఆమెకు మంచి ఆఫర్స్ వస్తే బాగుండు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus