సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం రంగుల ప్రపంచం కాదు. చీకటి కోణాలు కూడా కోకొల్లలుగా ఉంటాయి. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి అమ్మాయి.. పెద్ద హీరోయిన్ అయిపోవాలనుకుంటుంది. అయితే.. అదృష్టం ఉన్న ఒకరిద్దరు హీరోయిన్లు మాత్రమే నెగ్గుకురాగలుగుతుంటారు. కొంత మంది మాత్రం కోటి ఆశలతో వచ్చి.. అవకాశాలు రాక “వేరే” దారుల్లో డబ్బులు సంపాదించడం ఒక్కటే మార్గంగా భావిస్తుంటారు. ఆ వేరే మార్గం ఎంచుకొన్న కథానాయికలలో పాయల్ ఘోస్ అలియాస్ హారిక ఒకర్తి.
“ప్రయాణం” సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన పాయల్ ఘోస్ః.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు లభించలేదు. “ఊసరవెల్లి” చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించినా ఆమెకు అవకాశాలు దక్కలేదు. దాంతో సిటీలో జరిగే చిన్న చిన్న ఈవెంట్లకు గెస్ట్ గా వెళ్లడానికి అలవాటుపడింది. ఈమధ్య ఓ ప్రయివేట్ ఈవెంట్ కు పాయల్ ఘోష్ వేసుకొచ్చిన డ్రెస్ చూసి అందరూ విపరీతంగా షాక్ అయ్యారు. వెనుక భాగం మొత్తాన్ని గాలికి ఒదిలేసి.. బీగ్రేడ్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని స్థాయిలో ప్రత్యక్షమైంది.
సినిమా అవకాశాల కోసమే అయితే ఈస్థాయిలో దిగాజారాల్సిన అవసరం లేదు. మరి పాయల్ దిగజారుడు వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఆమెకే తెలియాలి!