తన పెళ్లి గురించి చెప్పిన ‘ఆర్ఎక్స్ 100’ హాట్ బ్యూటీ

  • November 14, 2018 / 07:45 AM IST

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైనా అందాల భామ పాయల్‌ రాజ్‌పుత్‌. ఈ సెక్సీ బ్యూటీ చేసిన మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకొని వరుస ఆఫర్స్ ని దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వీఐ ఆనంద్ దర్శకత్వంలో హీరో రవితేజ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లో మొదలవుతుందని సమాచారం. తన అందచెందాలతో ఆకట్టుకుంటున్న ఈ పంజాబీ బ్యూటీ కోసం మరిన్ని క్రేజీ ఆఫర్స్ కూడా లైన్ లో ఉన్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటె, ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుందనే వార్త ఇటీవల హల్ చల్ చేసింది. అయితే ఆమె పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే కానీ అది నిజమైన పెళ్లి కాదని సినిమా పెళ్లి అని తెలిసింది. ఈ విషయం ఆమె దగ్గర ప్రస్తావించగా, అవును నాకూడా పెళ్లి చేసుకోవాలని, హ్యాపీ గా సెటిల్ అవ్వాలని ఉంది, కానీ అది ఇప్పుడే కాదు సినిమాల్లో నటించి తన కంటూ మంచి గుర్తింపు లభించిన తరువాత అప్పుడు పెళ్లి చేసుకుంటానని ఈ పంజాబీ హాట్ బ్యూటీ చెప్పిందట. మరి మొదటి సినిమాతోనే మత్తెకిచ్చిన ఈ భామ త్వరలో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో ఉంటుందో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus