‘ఆర్.ఎక్స్.100’ చిత్రంలో తన గ్లామర్ తో కుర్రకారుని నిద్ర లేకుండా చేసింది పాయల్ రాజ్ పుత్. ఆ చిత్రంలో కామంతో విలవిలలాడిపోయే.. అమ్మాయిలా హీరోని వాడుకుని వదిలేసే.. అమ్మాయిగా నెగిటివ్ రోల్ చేసి.. ఆ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేర్చింది. ముద్దుల సన్నివేశాల్లో కానీ శృంగార సన్నివేశాల్లో కానీ ఈ అమ్మడు అస్సలు తగ్గలేదు. ఆ చిత్రంతో తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ప్రేక్షకులు కూడా పాయల్ నుండే అలాంటి పాత్రలనే ఆశిస్తున్నారు.
మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న పాయల్ ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ చిత్రంలో కూడా అలాంటి బోల్డ్ సీన్స్ లెక్కలేనన్ని ఉన్నాయని టీజర్ చూస్తే స్పష్టమవుతుంది. అయితే వరుసగా ఇలాంటి పాత్రల్లో నటించడం వల్ల కుటుంబ సభ్యుల ఏమనరా.. అని పాయల్ ను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పింది. ‘నేను ఏదైనా సినిమా ఒప్పుకున్నప్పుడు ఆ సినిమాలో ఉండే బోల్డ్ సీన్స్ గురించి మా అమ్మకు ముందే చెప్పేస్తాను. ఇన్ని లిప్ లాక్ సీన్స్ ఉన్నాయట.. పాత్ర కోసం ఇలా ఉండాలట.. ఇలాంటి ఇంటిమేట్ సీన్స్ ఉంటాయట అంటూ అన్ని విషయాలను అమ్మతో చెప్తాను. సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని అమ్మతో షేర్ చేసుకుంటాను. ‘నీ ఇష్టం’ అని అమ్మ నన్ను వదిలేస్తుంది. బోల్డ్ పాత్రలు చేయడం ఇష్టం.. కాని ఆ పాత్రల్లో నటించినప్పుడు ఆ సినిమాలను అమ్మా నాన్నలతో కలిసి చూడటం కష్టంగా ఉంటుంది. కాని ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ చిత్రంలో ఇంటిమేట్ సీన్స్ ఉన్నప్పటికీ ఈ సినిమాను నేను అమ్మా నాన్నలతో చూడాలనుకుంటున్నాను. లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ చిత్రం కచ్చితంగా నన్ను మరో స్థాయికి తీసుకెళ్తుంది అనే నమ్మకం నాకు ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.
1
2
3
4
5
6
7
8
9
10
సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!