Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Advertisement

వెండితెరపై చూసి సినిమా వాళ్ళ లైఫ్ ఎంతో కలర్ఫుల్ గా ఉంటుందని అంతా అనుకుంటారు. కానీ మేకప్ వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉంటాయి అని చాలా మందికి తెలీదు.

Payal Rajput

తాజాగా నటి పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ఒక ప్రెస్ మీట్‌లో తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అత్యంత బాధాకరమైన విషయాల్ని పంచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యింది. అనంతరం ఆమె ఆ ప్రెస్ మీట్ నుండి బయటకి వెళ్లిపోవడం అనేది షాకిచ్చే అంశం.

ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ… ” అవును నేను అనారోగ్యం పాలయ్యాను. అయితే నా లైఫ్లో మా నాన్నగారు ఒక హీరో లాంటివారు. నా ప్రతి సినిమాను ఎంతో విశ్లేషించేవారు. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాలో నేను బోల్డ్ గా నటించాను. అయినప్పటికీ.. నా వరకు నేను ఆ పాత్రకి పూర్తిగా న్యాయం చేశానని నాన్నగారు తెలిపారు. 8 నెలల క్రితం ఆయనకి క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యింది. ఆ కష్టకాలంలో నా కుటుంబాన్ని, ముఖ్యంగా నా తల్లిని ఎలా ఓదార్చాలో తెలియక ఎంతో మానసిక వేదనను అనుభవించాను.

మా నాన్నగారి చివరి రోజుల్లో నేను నటించిన పంజాబీ సినిమా ‘ఖుష్‌ఖబ్రీ’రిలీజ్ అయ్యింది. అది ఆయన చూడలేకపోయారు అనే బాధ నన్ను మరింతగా కృంగదీసింది.ఈ మానసిక ఒత్తిడి నుండి బయటపడటానికి  జైపూర్‌లో విపాసన కోర్సు కూడా చేశాను” అంటూ చెబుతూ కన్నీళ్ళు పెట్టుకుంది. అనంతరం ఆమె ఈవెంట్ నుండి బయటకి వెళ్ళిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus