ఆర్ డి ఎక్స్ లవ్ సినిమాను హిట్ అనుకొంటున్న పాయల్ రాజ్ పుత్

ఒక్కోసారి హీరోలకంటే ఎక్కువగా హీరోయిన్లే ఒక భ్రమలో ఉండిపోతారు. అంత త్వరగా ఆ భ్రమ నుండి బయటకు రావడానికి ఇష్టపడరు, ప్రయత్నించరు కూడా. ఇప్పుడు పాయల్ ను చూస్తే అదే అనిపిస్తుంది. “ఆర్ ఎక్స్ 100″లో తన ఆందాల ఆరబోత, శ్రుతిమించిన శృంగార సన్నివేశాల పుణ్యమా అని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన పాయల్.. అనంతరం ఆమెకు బోలెడు సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ.. “ఆర్ డి ఎక్స్ లవ్” అనే సినిమాను సైన్ చేసింది.

ఆ సినిమా గత శుక్రవారం విడుదలైంది. టీజర్ & ట్రైలర్ లో ఉన్న హీరోయిన్ శ్రుతిమించిన ఎక్స్ పోజింగ్ సీన్స్ పుణ్యమా అని మార్నింగ్ షోస్ ఫుల్ అయినా.. మ్యాట్నీ నుండే వసూళ్లు సన్నగిల్లాయి. మరీ ముఖ్యంగా.. రివ్యూలు మరీ ఘోరంగా రావడంతో వీకెండ్ లో కనీస స్థాయి వసూళ్లు కూడా రాలేదు. కానీ.. పాయల్ పాప మాత్రం తన సినిమాను ప్రేక్షకులు ఆదరించారని, తనకు లోయల్ ఆడియన్స్ ఉన్నారని భ్రమలో ఉండిపోయింది. వాళ్ళకి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ కూడా చేసింది. అయితే.. “వెంకీ మామ” నిర్మాతలు మాత్రం ఈ ఎఫెక్ట్ తమ సినిమా మీద ఏమైనా పడుతుందా అని కంగారుపడుతున్నారు.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus