మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘పెద్ది'(Peddi). ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా విడుదలై ఇప్పుడు 4వ వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారం మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా.. రెండో వారంలో కూడా పోటీగా మరో పెద్ద సినిమా లేకపోవడంతో బాగానే క్యాష్ చేసుకుంది. అల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లోని బయ్యర్స్ అంతా సేఫ్ జోన్లోకి వచ్చేశారు.
కాకపోతే ఓవర్సీస్ లో, కర్నాటకలో అలాగే మిగతా భాషల్లో ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోనుంది. తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్స్ సేఫ్ జోన్లోకి వచ్చారు. ఇక లాభాలు అందుకుంటారు అనుకుంటే టైమ్లో ‘మా ఇంటి బంగారం’ వచ్చి.. ‘పెద్ది’ వసూళ్లకి బ్రేక్ వేసింది. 4వ వీకెండ్ కి కొంత వరకు థియేటర్స్ దక్కాయి. దీంతో మళ్ళీ ఓ మోస్తరుగా క్యాష్ చేసుకుంది. ఒకసారి 25 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 54.55 cr |
| సీడెడ్ | 22.06 cr |
| ఉత్తరాంధ్ర | 21.35 cr |
| ఈస్ట్ | 12.01 cr |
| వెస్ట్ | 8.57 cr |
| గుంటూరు | 10.91 cr |
| కృష్ణా | 9.67 cr |
| నెల్లూరు | 5.55 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 144.67 cr |
| కర్నాటక + తమిళ్+ హిందీ+ కేరళ | 30.80 cr |
| ఓవర్సీస్ | 21.10 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 196.57 cr(షేర్) |
‘పెద్ది’ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.225 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 25 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.196.57 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.351.2 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.28.43 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.