మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘పెద్ది'(Peddi). ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా విడుదలై ఇప్పుడు 3వ వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారం మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా.. రెండో వారంలో కూడా పోటీగా మరో పెద్ద సినిమా లేకపోవడంతో బాగానే క్యాష్ చేసుకుంది. అల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లోని బయ్యర్స్ అంతా సేఫ్ జోన్లోకి వచ్చేశారు.
కాకపోతే ఓవర్సీస్ లో, కర్నాటకలో అలాగే మిగతా భాషల్లో ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోనుంది. తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్స్ సేఫ్ జోన్లోకి వచ్చి లాభాలు అందుకునే టైమ్లో ‘మా ఇంటి బంగారం’ వచ్చి.. ‘పెద్ది’ వసూళ్లకి బ్రేక్ వేసింది. ఒకసారి 3 వీక్స్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 54.15 cr |
| సీడెడ్ | 21.82 cr |
| ఉత్తరాంధ్ర | 21.09 cr |
| ఈస్ట్ | 11.88 cr |
| వెస్ట్ | 8.47 cr |
| గుంటూరు | 10.80 cr |
| కృష్ణా | 9.55 cr |
| నెల్లూరు | 5.47 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 143.28 cr |
| కర్నాటక + తమిళ్+ హిందీ+ కేరళ | 30.75 cr |
| ఓవర్సీస్ | 21.05 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 195.08 cr(షేర్) |
‘పెద్ది’ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.225 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 వారాలు పూర్తయ్యేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.195.08 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.348.58 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.29.92 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.