Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Advertisement

అన్నీ అనుకున్నట్టు జరిగి ఉండుంటే.. ఈ ఏప్రిల్ 30కి ‘పెద్ది'(Peddi) సినిమా రిలీజ్ అయ్యి ఉండేది. అప్పుడంతా ఆ సినిమా హవా నడిచేది. కానీ ఇప్పుడు ఆ సినిమా ఏకంగా 2 నెలలు వెనక్కి వెళ్లింది.

Peddi

జూన్ 25న ‘పెద్ది’ రిలీజ్ కాబోతోందని దర్శకుడు బుచ్చిబాబు నిన్న జరిగిన ‘కర’ ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఐటెమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది అని కూడా బుచ్చిబాబు రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే… దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి ఒక వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యి హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో రామ్ చరణ్ మరియు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఒక మాస్ డ్యాన్స్ నంబర్‌కు చిందేస్తూ కనిపిస్తున్నారు. చరణ్ తనదైన గ్రేస్ మరియు ఎనర్జీతో స్టెప్పులు వేస్తుంటే, శృతి హాసన్ అతనికి గట్టి పోటీ ఇస్తోంది. ఆమె కూడా బెస్ట్ డాన్సర్ అనే సంగతి తెలిసిందే.

2014 లో వచ్చిన ‘ఎవడు’ సినిమా తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ తెరపై కనిపించనుంది. దర్శకుడు బుచ్చిబాబు సన ఈ చిత్రాన్ని ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఒక పీరియడ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ పాత్ర చాలా ఊర మాస్‌గా ఉండబోతోంది. క్రికెట్ ప్లేయర్ గానే కాకుండా, కుస్తీ ఫైటర్ గా కూడా చరణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇక ‘పెద్ది’ ఐటెమ్ సాంగ్ కోసం సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ అదిరిపోయే మాస్ బీట్ ను కంపోజ్ చేసినట్టు తెలుస్తోంది.ప్రస్తుతానికి ఈ లీక్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus