సూపర్ సక్సెస్ ఫుల్ సీక్వెల్ స్ట్రీమింగ్ లైవ్!

జగదాంబ అలియాస్ జగ్గు-వరుణ్ ల పెళ్లి ఫిక్స్ అయ్యాక పారిపోయి, గొడవపడి, విడిపోయి, గిల్లికజ్జాలాడి మరీ పెళ్లాడిన తతంగం మొత్తం “పెళ్లిగోల” వెబ్ సిరీస్ లో చూశాం. కానీ.. సెకండ్ సీజన్ మొదలయ్యేసరికి కొత్తగా పెళ్లి చేసుకొన్న జగ్గు-వరుణ్ ల నడుమ మళ్ళీ గొడవలు మొదలయ్యాయ్. హాస్పిటల్లో బిజీ అయిపోయిన వరుణ్ ఇంట్లో ఉండే జగ్గూను పట్టించుకోకపోవడం వలన ఆ గొడవలు ఏకంగా విడాకుల దాకా వెళ్ళగా.. జగ్గుకి బావ అయిన బాల్ రాజుకి పెళ్లి సెట్ అయ్యిందని, ఆ పెళ్లి తామే దగ్గరుండి చేయాలని పెద్దలు నిర్ణయించడంతో వేరే దారి లేక తాము విడిపోతున్న విషయం దాచిపెట్టి బాల్ రాజు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి అమలాపురం వస్తారు వరుణ్ & జగ్గు.

కట్ చేస్తే.. బాలరాజు కోసం అతని మావయ్య వెతికి పెట్టి మరీ నిశ్చయ తాంబూలం అందించిన అమ్మాయి అప్సరకి.. పెళ్లి కొడుకైన బాలరాజంటే ఇష్టం లేదని, ఆమె ఆల్రెడీ కెమెరామెన్ శోభన్ బాబుతో ప్రేమలో మునిగితేలుస్తుందని గ్రహించిన జగ్గు-వరుణ్ లు తమ స్నేహితుడు కృష్ణతో కలిసి అప్సర మనసులో బాలరాజు మీద ప్రేమ ఏర్పడేలా చేసేందుకు ఒక్క పెద్ద మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ఫలించిందా లేదా, అందుకోసం వరుణ్ & జగ్గు పడిన పాట్లేమిటి? ఈ నేపధ్యంలో విడిపోవాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన వరుణ్ & జగ్గు నడుమ ప్రేమ చిగురించిందా? వంటి ప్రశ్నలకు దర్శకుడు శివ సాయి వర్ధన్ ఆద్యంతం అలరించే విధంగా నవ్వులు విరబూయిస్తూ తెరకెక్కించిన సమాధానమే “పెళ్లి గోల 2”. మొదటి సీజన్ కంటే రెండింతలు వినోదంతో ప్రస్తుతం “viu.com“లో లైవ్ స్త్రీమ్ అవుతోంది. అర్జెంట్ గా ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి.. “పెళ్లి గోల 2″తోపాటు ఒకసారి “పెళ్లి గోల”ను కూడా చూసేయండి.

Click Here to Watch Full Episodes

–

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus