బిగ్ బాస్ లో ప్రస్తుతం బిబి డే కేర్ సెంటర్ టాస్క్ నడుస్తోంది. ఇందులో పిల్లలు – కేర్ టేకర్స్ గా రెండు టీమ్స్ విడిపోయాయి. ఇందులో అరియానాకి సోహైల్ కేర్ టేకర్. అలాగే మోనాల్ హారికకి కేర్ టేకర్. అమ్మరాజశేఖర్ కి అభిజిత్, అవినాష్ కి నోయల్, మెహబూబ్ కి అఖిల్ కేర్ టేకర్స్ గా ఉన్నారు. ఇక చిన్నపిల్లలుగా మారిన హౌస్ మేట్స్ కేర్ టేకర్స్ కి చుక్కలు చూపిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా హారిక మోనాల్ తో ఒక ఆట అడుకుంటోంది. అల్లరి పిల్లగా, పెంకిపిల్లగా, మొండిపిల్లగా చేయాల్సిన రచ్చ అంతా చేస్తోంది. ఇక్కడే హారికకి – అరియానాకి పెన్సిల్ ఇష్యూ వచ్చింది.
అఖిల్ క్లాస్ చెప్తుంటే అరియానా డ్రాయింగ్ వేస్తున్నపుడు వెనకనుంచి వచ్చి మరీ హారిక పెన్సిల్ కొట్టేసింది. అంతకుముందు హారిక పౌంచ్ ని అమ్మరాజశేఖర్ కొట్టేశారు. సేమ్ టు సేమ్ ఇలాగే హారిక కూడా అరియానా దగ్గర పెన్సిల్ లాక్కుంది. ఇక్కడే ఇద్దరూ కాసేపు అల్లరి చేశారు. పరిగెత్తుకుంటూ వచ్చి మరీ అరియానా హారిక దగ్గర పెన్సిల్ లాగేసుకుంది. పిల్లలు అంటేనే అల్లరి. అల్లరి అంటేనే పిల్లలు. ఇదే టాస్క్ లో బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నపుడు రూడ్ గా వచ్చి పెన్సిల్ లాక్కోవడం హారికకి నచ్చలేదు. ఇదే పాయింట్ పైన మోనాల్ పై కాస్త సీరియస్ అయ్యింది. ఈ టాస్క్ అయ్యాక మాట్లాడదాం అంటూ కన్ క్లూజన్ ఇచ్చింది.
ఇక్కడ అరియానా తన లోకంలో తను ఉంటూ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోదు. అంతేకాదు, టాస్క్ వచ్చిందంటే వీరిద్దరికీ ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూలో క్లాష్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ రోబో టాస్క్ అప్పట్నుంచి కొంటెరాక్షసులు టాస్క్ వరకూ అరియానా ఏదో ఒకటి అనడం.., హారిక ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. అయితే, ఈ పెన్సిల్ ఇష్యూ వల్ల ఇప్పుడు అభిజిత్ కి హారికకి ఫ్రెండ్షిప్ కట్ కాబోతోందనే అనిపిస్తోంది. ఎందుకంటే, టాస్క్ లో జరిగిన ఇష్యూని అభిజిత్ హారికతో మాట్లాడుతుంటే హారిక బాగా ఫీల్ అయ్యింది. వీరిద్దరి మద్యన ఒక సీరియస్ ఫైట్ అయ్యింది. మరి ఈ టాస్క్ సీరియస్ గా మారుతుందా.. లేదా సరదాగా ఎండ్ అవుతుందా అనేది చూడాలి.
Most Recommended Video
కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!