Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

ప్రముఖ కథానాయకుడు చిరంజీవి హోస్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగా వర్స్‌’ అనే టాక్ షో రానున్న విషయం తెలిసిందే. 13 ఎపిసోడ్లు ఉంటుంది అని చెబుతున్న ఈ టాక్‌ షో గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే రెండు ఎపిసోడ్‌ల షూటింగ్‌ జరిగింది అని చెబుతున్నారు. అయితే ఇప్పుడు మెగావర్స్‌కి నిజమైన అర్థం చెప్పేలా ఓ ఎపిసోడ్‌ను షూట్‌ చేయడానికి రెడీ అయిపోతున్నారట.

Megaverse

తొలి సీజన్‌ ముగింపు ఎపిసోడ్‌ కోసం మెగా వర్స్‌ మొత్తాన్ని రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారట. అంటే మెగా లోకం మొత్తం రెడీ అవుతోందట. నాగబాబు, పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌.. ఇలా అందరినీ ఆ ఎపిసోడ్‌లో భాగం చేసే ప్రయత్నం చేస్తున్నారట. కుదిరితే సాయిధరమ్‌ తేజ్‌, నిహారిక, లావణ్య త్రిపాఠి, వైష్ణవ్‌ తేజ్‌ను కూడా ఇందులో ఏదో రకంగా భాగం చేసే ప్రయత్నాల్లో ఉన్నారట.

అదే జరిగితే.. టాలీవుడ్‌లో ఇంతకుమించిన బిగ్గెస్ట్‌ ఫ్రేమ్‌ను ఓటీటీలో మనం చూడలేం. కాబట్టి సుస్మిత కొణిదెల ప్రయత్నాలు సఫలమై అందరూ ఒకే ఎపిసోడ్‌లో రావాలి. ఆమె ఎందుకు అనుకుంటున్నారా? ఆమెనే ఈ షోకి నిర్మాత. ఇక ఇప్పటికే బ్రహ్మానందం – సునీల్ – సత్య ఎపిసోడ్ షూటింగ్‌ పూర్తయ్యింది. తాజాగా కమల్ హాసన్ ఎపిసోడ్‌ కూడా షూట్ చేశారు. మరికొందరు సెలబ్రిటీస్ కూడా రెడీ అవుతున్నారని టాక్‌.

నిజానికి, ఈ షోలో కేవలం సినిమా సెలబ్రిటీలనే కాకుండా.. ఇతర రంగాల ప్రముఖులను కూడా ఈ షోలో భాగం చేస్తారని అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే కేవలం సినిమా సెలబ్రిటీల సమాచారం మాత్రమే బయటకు వస్తోంది. మరో వారంలో మొత్తం వివరాలు బయటకు రావొచ్చు. ఎందుకంటే దీపావళికి షో ప్రోమో వస్తుందని చెబుతున్నారు కాబట్టి. 192 దేశాల్లో ఈ టాక్‌ షో టెలీకాస్ట్‌ కానున్న నేపథ్యంలో కాస్త మంచి బజ్‌ వచ్చినా.. సూపర్‌ గుర్తింపు వచ్చేస్తుంది.

 ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus