మోడీ పుణ్యమా అని మహేష్ షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది

  • June 30, 2018 / 05:47 AM IST

మన సూపర్ స్టార్ మహేష్ బాబుని, మన ప్రైమ్ మినిస్టర్ మోడీకి అసలు సంబంధమే లేదు కదా అలాంటప్పుడు మోడీ మన మహేష్ 25వ సినిమా షూటింగ్ కి అడ్డంకిగా ఎలా మారాడు? కొంపదీసి మహేష్ టి.డి.పి సపోర్ట్ కాబట్టి అలా ఏమైనా జరిగి ఉండొచ్చా అని తెగ ఆలోచించేస్తున్నారా? మహేష్ బాబు సినిమా షూటింగ్ కి మోడీ అడ్డంకిగా నిలిచిన మాట వాస్తవమే కానీ ఇందులో ఎలాంటి రాజకీయ పరమైన యాంగిల్స్ లేవు. ఉన్నదల్లా యోగా యాంగిల్ మాత్రమే. మొన్నామధ్య యోగా డే సందర్భంగా మోడీ డెహ్రాడూన్ వెళ్ళిన విషయం తెలిసిందే. అక్కడే యోగా డే సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు.

అందుకోసం.. ఆల్రెడీ షూటింగ్ పర్మిషన్ తీసుకొన్న మహేష్ బాబు & టీం ను ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లోనికి రానివ్వలేదు. దాంతో అనుకొన్న ప్రకారం షెడ్యూల్ కంప్లీట్ చేయలేకపోయారు చిత్రబృందం. మళ్ళీ ఆ షూటింగ్ లో పాల్గొనాల్సిన అందరి ఆర్టిస్టుల డేట్స్ అడ్జెస్ట్ అవ్వడం బాగా లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఆ షెడ్యూల్ ను పోస్ట్ పోన్ చేసి మరో షెడ్యూల్ ను మొదలెట్టే పనిలో ఉన్నారు బృందం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus