నిర్మాత కొడుకు అడ్డంగా దొరికాడు!!!

  • March 25, 2017 / 06:22 AM IST

పోలీసోడు కొడుకు….పోలీస్ అవుతాడని రూల్ లేదు….ఇక నిర్మాత కొడుకు నిర్మాత అవ్వాలని సైతం ఏ రూల్ లేదు…అయితే ఏమయిందో ఏమో…తెలీదు కానీ….ఒక ప్రముఖ నిర్మాత కొడుకు ఏకంగా దొంగ అయ్యీ…పోలీసులకు చిక్కాడ…ఇంతకీ ఎవరా ప్రభుద్దుడు అంటే…..టాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలకు పంపిణీ దారుడుగా వ్యవహరిస్తూనే…సినిమాలను సైతం నిర్మిస్తూ బడా నిర్మాతగా పేరు తెచ్చుకున్న సీ. కల్యాణ్ ఆర్ధికంగా మంచి వ్యాపారవేత్త…అయితే….తన కొడుకు మాత్రం దొంగతనం చేసి…అడ్డంగా బుక్ అయ్యాడు…..వివరాల్లోకి వెళితే….

బంజారా హిల్స్ ఫిలిం నగర్ క్లబ్ కు రవాణా వ్యాపారి బి శ్రీనివాస్, అతని కొడుకు ఈత కోసం వచ్చారు. అయితే శ్రీనివాస్ పర్స్ గట్టున పెట్టి స్విమ్ చేయడానికి వెళ్లాడు….తిరుగు వచ్చి చూస్తే….తాను గట్టు మీద పెట్టిన పర్సుని ఎవరో దొంగిలించారు. అందులో క్రెడిట్, డెబిట్ ఏటీఎం కార్డులున్నాయి. అదే క్రమంలో పర్సు పోయిన కొన్ని గంటల వ్యవధిలోనే కార్డులోని బ్యాంకు ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీ కావటంతో పోలీసుల్ని ఆశ్రయించారు బాధితుడు…. దాదాపుగా యాక్సిస్ బాంక్ కార్డు నుంచి రూ.1.82 లక్షలు.. ఐసీఐసీఐ బ్యాంకు కార్డు నుంచి రూ.27600 మొత్తం చిల్లర వరుణ్ కుమార్ (సీ. కల్యాణ్ కుమారుడు) అకౌంట్లోకి బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఆధారాల కోసం వెతకడ….ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాల అసలు నిజాన్ని బయటపెట్టాయి….బాధితుడి పిర్యాదు మేరకు….ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు… వరుణ్‌ కుమారే పర్సు చోరీ చేసినట్లు కన్ఫర్మ్ చేశారు….దాంతో వరుణ్ కుమార్ మీద బంజారా హిల్స్ పోలీసులు దొంగతనం కేసు బుక్ చేసారు. పాపం నిర్మాత కొడుకు చివరకు దొంగయ్యాడు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus