Pooja Hedge: క్రికెటర్ తో పెళ్లి పీటలు ఎక్కబోతున్న పూజా హెగ్డే?

  • September 25, 2023 / 04:09 PM IST

సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి పూజా హెగ్డే ఒకరు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం ఒక్క సినిమా అవకాశం లేకుండా ఉండడమే కాకుండా గతంలో ఈమె నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా డిజాస్టర్ గా మిగిలిపోయాయి. దీంతో ఈమెకు పూర్తిగా అవకాశాలు దూరమయ్యాయి అని చెప్పాలి.

ఇలా చేతిలో సినిమా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో కాలం వెళ్లదీస్తున్నటువంటి పూజా హెగ్డే గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పూజ హెగ్డే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. పూజా హెగ్డే ప్రముఖ స్టార్ క్రికెటర్ తో ప్రేమలో ఉంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆ క్రికెటర్ ఎవరు అంటూ అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

సినిమా రంగానికి క్రికెట్ రంగానికి విడదీయరాని అనుబంధం ఉంది అనే సంగతి మనకు తెలిసిందే. ఎప్పటినుంచో సినీ సెలబ్రిటీలను క్రికెటర్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరుగుతూ వస్తోంది. ఇలా ఇప్పటికే ఎంతోమంది సినీ తారలు క్రికెటర్లను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు.ఈ క్రమంలోనే పూజా హెగ్డే కూడా క్రికెటర్ తో ప్రేమలో పడ్డారని త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ సమాచారం ప్రకారం పూజా హెగ్డే ఆ క్రికెటర్ తో కలిసి తాజాగా ఒక ప్రైవేట్ పార్టీకి అటెండ్ అయ్యారని, ఇలా వీరిద్దరూ జంటగా కలిసి వెళ్లడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది. క్రికెట్ తో ప్రేమలో ఉన్నటువంటి పూజా హెగ్డే త్వరలోనే అతనిని పెళ్లి చేసుకోబోతున్న వార్త ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది మరి ఈమె గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియాలి అంటే ఈ వార్తలపై పూజ స్పందించాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus