ఇక్కడ స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.. మరి అక్కడ ఏమవుతుందో

Advertisement

తమిళనాట పరిచయ చిత్రమైన “మాస్క్”, తెలుగులో పరిచయ చిత్రమైన “ఒకలైలా కోసం”, బాలీవుడ్ పరిచయ చిత్రమైన “మొహెన్ జొదారో” డిజాస్టర్లుగా నిలిచినప్పటికీ.. “దువ్వాడ జగన్నాధం” చిత్రంతో మంచి విజయాన్ని అందుకొని తన అందాల ఆరబోతతో ప్రేక్షకుల్ని తనవైపుకు తిప్పుకొన్న పూజా హెగ్డే తెలుగులో “అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్” చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర కథానాయిక హోదాను ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే బాలీవుడ్ లో మళ్ళీ తన అదృష్టం పరీక్షించుకొనేందుకు సన్నద్ధమవుతోంది.

అక్షయ్ కుమార్, రితీష్ దేశ్ ముఖ్, బాబీ డియోల్ కథానాయకులుగా హిందీలో తెరకెక్కుతున్న “హౌస్ ఫుల్ 4” మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది పూజా హెగ్డే. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న విడుదలైంది. రెండు విభిన్నమైన పాత్రల్లో ఎప్పట్లానే గ్లామర్ గా కనిపిస్తోంది పూజా హెగ్డే. ఈ ప్రొజెక్ట్ మీద ఆమె చాలా ఆశలు పెట్టుకొంది. మరి ఈ సినిమా హిట్ అయ్యి ఆమె తెలుగులో వలె హిందీలోను స్టార్ హీరోయిన్ గా మారుతుందో లేదో చూడాలి.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read