తారక్ వల్ల బాగా కష్టపడుతున్న పూజ హెగ్డే

  • May 5, 2018 / 12:06 PM IST

బాలీవుడ్ బ్యూటీ పూజ హెగ్డే కెరీర్ డీజే సినిమా ముందు, తర్వాత అన్న రీతిగా మారిపోయింది. ఈ సినిమా చేయకముందు హోమ్లీ గర్ల్ అని పేరు దక్కించుకున్న ఈ పొడుగుకాళ్ల సుందరి.. దువ్వాడ జగన్నాథం తర్వాత హాట్ బ్యూటీ అయిపోయింది. అందులో ఆమె అందాలు, డ్యాన్సులకు ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు ఫిదా అయిపోయారు. అందుకే వరుసగా ఆఫర్లు అందుకుంది. రంగస్థలంలో జిగేల్ రాణి అంటూ ఓ ఊపు ఊపింది. బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి సాక్ష్యం మూవీ చేస్తోంది. ఇదే కాకుండా ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. వీటిలో ముందుగా ఎన్టీఆర్ సినిమా మొదలయింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ పై ఫైట్ సీన్ కంప్లీట్ చేశారు. రెండు షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ తో పాటు పూజా కూడా పాల్గొననుంది. అయితే ఎన్టీఆర్ తో నటించడం వరకు ఒకే.. డ్యాన్స్ అంటేనే భయపడుతోంది. సెట్ లో ఆయనతో సమానంగా స్టెప్స్ వేయకుంటే పరువుపోతోందుందని కంగారు పెడుతోందట. అందుకే ఇప్పటి నుంచే డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలెట్టేసిందని తెలిసింది. కేవలం ప్రతి రోజూ డాన్స్ కోసమే ఒక గంట కేటాయిస్తుందని సమాచారం. వచ్చే నెలలోపున ఎన్టీఆర్ స్పీడ్ ని అందుకునే విధంగా తయారవ్వాలని శ్రమిస్తోంది. ఎస్.ఎస్.థమన్ కూడా అదిరిపోయే బీట్ తో పాటలు ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus