గోపికమ్మా.. ఈ తడబాటేమిటమ్మా..?

Advertisement

‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది పూజ హెగ్డే. అటుపై వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ముకుంద’ సినిమాలో “గోపికమ్మ”గా అలరించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరో సినిమాకి సంతకం చేయనే లేదు. అశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన ‘మొహంజో దారో’ చిత్రం తన కెరీర్ ని మార్చేస్తుందని భావించి ఏడాదిన్నర పాటు ఆ సినిమాకే కేటాయించిన పూజ మధ్యలో కొన్ని అవకాశాలు వచ్చిన తిరస్కరించింది. తీరా ఆ సినిమా విడుదలై ఫలితం తారుమారయ్యిందని తెగ భాదపడిపోతుందట.

ఏడాదికి పైగా ఒకే సినిమాకి పరిమితమవడం అంటే హీరోలే వందలసార్లు ఆలోచిస్తారు. అలాంటిది హీరోయిన్ అయ్యుండి పూజ ఈ ఫీట్ చేసింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో తన దశ తిరుగుతుందని భావించి అల్లు అర్జున్ సినిమాకి కూడా నో చెప్పింది ఈ ముంబై అమ్మడు. దాంతో హీరోయిన్ వెతుకులాటలో నిమగ్నమయ్యారు దువ్వాడ జగన్నాధం అండ్ టీమ్. అయితే పూజ ఇప్పుడు ఈ సినిమాలో నటించేందుకు సుముఖంగా ఉందట. అందుకు చిత్ర బృందం కూడా పాజిటివ్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఏమైనా, ఇలాంటి తడబాటు తగదమ్మా.. గోపికమ్మా!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news