పూజితను మరీ రష్మీలా వాడుతున్నారుగా…!

ఈ మధ్య బూతు కంటెంట్ ఉన్న సినిమాలకి భారీ డిమాండ్ ఏర్పడింది. దానికే కొంచెం ప్రొఫెషనల్ గా ‘బోల్డ్’ అని పేరు పెట్టేసుకుని…. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు యువ దర్శకులు. మొన్నటికి మొన్న ‘ఆర్.ఎక్స్.100’ చిత్రం చేసిన రచ్చ అంతా… ఇంతా కాదు. గతంలో కూడా ‘గుంటూరు టాకీస్’ వంటి బూతు చిత్రంతో ప్రవీణ్ సత్తారు కూడా పేరుకెక్కాడు. ఇక వీళ్ళకి సహకరించే హాట్ భామలు దొరకాలే గాని… ఏ రేంజ్ గ్లామర్ షో పండిస్తారో… రష్మీ గౌతమ్, పాయల్ రాజ్ పుత్ లు నిదర్శనం. ఇప్పుడు ఆ లిస్ట్ లో నేనూ ఉన్నాను అంటూ ముందుకొచ్చింది … కుర్ర హీరోయిన్ పూజిత పొన్నాడ.

ఇక విషయంలోకి వెళితే… తాజాగా ‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ’ చిత్రంలో పూజిత హాట్ వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేసారు. ఈ వీడియో ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో సెగలు పుట్టిస్తోంది. రాయ్ లక్ష్మీ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో పూజిత పొన్నాడ, కార్తిక్, ప్రవీణ్, మధునందన్ తదితరులు నటిస్తున్నారు. కిషోర్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి రాయ్ లక్ష్మీ అందాలు ఎలాగూ సపోర్ట్ ఇస్తాయి, ఇక నేను కూడా తక్కువ కాదు అంటూ పూజిత చేసిన హాట్ షో కుర్రకారుకి హీటెక్కించడం ఖాయం. ‘ఏం జరుగుతుంది నాలో’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ టీజర్‌లో పూజిత అందాల ఆరబోత ఓ రేంజ్లో ఉంది. ఈ సాంగ్ కి సెన్సార్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారా… అనేదాని పై కూడా చర్చ మొదలైంది. ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ హాట్ సాంగ్ ని మీరు కూడా ఓసారి చూసెయ్యండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus