ఈమధ్యకాలంలో సినిమాలో ఫైట్స్ కంటే లిప్ లాక్స్ ఎక్కువయ్యాయి. లిప్ లాక్స్ తో పోస్టర్స్ రిలీజ్ చేస్తేనో లేక ట్రైలర్ లో ఒకట్రెండు లిప్ లాక్స్ ఉంటేనో సినిమాకి క్రేజ్ వస్తుందని కొందరు దర్శకనిర్మాతలు నమ్ముతున్నారు. కొత్త హీరోయిన్స్ కి ఎలాగూ ఈ ముద్దుల గోల తప్పదు, పెద్ద హీరోయిన్స్ కేమో భారీ మొత్తంలో రెమ్యూనరేషన్స్ ఇచ్చి మరీ ఈ లిప్ లాక్స్ పెట్టిస్తారాయే. కానీ.. “వేరీజ్ ది వెంకటలక్ష్మీ” ట్రైలర్ లో హీరోయిన్ రాయ్ లక్ష్మీ ఆరబోసిన అందాలకంటే ఎక్కువగా ఆకట్టుకొన్న విషయం ఆ చిత్రంలో మరో ముఖ్యపాత్ర పోషిస్తున్న పూజిత పొన్నాడతో ఒక లిప్ లాక్ పెట్టించారు. కథకి ఆ లిప్ లాక్ ఎంత అవసరం అనేది తెలియదు కానీ.. సినిమాలో ఆమెను గట్టిగానే వాడారని మాత్రం అర్ధమవుతోంది.
నిన్నమొన్నటివరకూ గ్లామరస్ సైడ్ రోల్స్ కి పరిమితమైన పూజిత పొన్నాడ ఇప్పుడు సడన్ గా ఇలాంటి సెక్సీ లుక్స్ & లిప్ లాక్స్ పుష్కలంగా ఉన్న రోల్ ప్లే చేస్తుండడం చర్చనీయాంశం అయ్యింది. మరి ఈ లిప్ లాక్స్ కు ఆమెకు సెక్సీ ఇమేజ్ తెచ్చిపెడుతుంది అనడంలో సందేహం లేదు కానీ… అలాంటి ఇమేజ్ వచ్చాక ఆమెకు ఎంతవరకూ అది ప్లస్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే.. ఇకపై ఆమెను అప్రోచ్ అయ్యే దర్శకులు అందరూ ఈ తరహా హాట్ సీన్స్ రాసుకోవడం ఖాయం. మరి ఇమేజ్ కాపాడుకోవడం కోసం ఆ తరహా హాట్ సీన్స్ చేస్తూ పోతుందో లేక ఎందుకొచ్చిన గోల అని తప్పుకుంటుందో చూడాలి.